శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తిలో యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతిభకు గౌరవం లభించింది. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులకు మంగళవారం ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు హేమకుమార్ మాట్లాడుతూ.. కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన బోధనా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లలితతో పాటు సంస్థ సభ్యులు షరీఫ్, నారాయణ, శ్రీను, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్రైబల్ కళాశాల విద్యార్థినులకు బహుమతులు అందించిన యంగ్ ఎంప్లాయీస్ సంస్థ