Wednesday, 22 April 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక శోభ-బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు.
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక శోభ-బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తిలో అద్వైత సిద్ధాంత కర్త, జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్థానిక బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఉత్సవాల్లో భాగంగా ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపు పొడవునా భక్తులు, బ్రాహ్మణ యువజన సంఘం ప్రతినిధులు భజనలు, శ్లోక పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. శంకరాచార్యులు అందించిన ధర్మబోధనలు, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ శోభాయాత్రలో బ్రాహ్మణ యువజన సంఘం నాయకులు, సభ్యులు, పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. పట్టణంలోని ప్రముఖులు కూడా ఊరేగింపులో పాల్గొని స్వామివారికి నీరాజనాలు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.