Wednesday, 24 June 2026
  • Home  
  • విశాఖ అభివృద్ధిలో మైలురాయి ఎం ఐ జీ హౌసింగ్ ప్రాజెక్టు, వర్చువల్ రియాలిటీ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ హాజరైన ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్
- ఆంధ్రప్రదేశ్

విశాఖ అభివృద్ధిలో మైలురాయి ఎం ఐ జీ హౌసింగ్ ప్రాజెక్టు, వర్చువల్ రియాలిటీ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ హాజరైన ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్

వి ఎం ఆర్ డి ఎ అధ్వర్యంలో పి పి పి విధానంలో నూతనంగా చేపడుతున్న రెండు ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఎండాడ లా కళాశాల రోడ్ లో వి ఎం ఆర్ డి ఎ, అధ్వర్యంలో వికసిత్ భరత్, స్వర్ణ ఆంధ్రా లక్ష్యాన్ని చేరుకునేలా విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా పి పి పి విధానంలో చేపడుతున్న వైజాగ్ వర్చువల్ రియాలిటీ సెంటర్, 3స్టార్ హోటల్ ప్రాజెక్ట్ కి, మిథిలాపురి లో చేపడుతున్న ఎం ఐ జీ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించి, శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖ అభివృద్ధి పథంలో పయనిస్తుంది అని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులో కి రానుందని, విశాఖ, భోగాపురం విమానాశ్రయానికి మధ్య ఉన్న మధురవాడ పరిసరాలు హైదరాబాద్ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తరహాలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. ఐటీ పరిశ్రమకు కేరాఫ్ గా మారుతున్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వి ఎం ఆర్ డి ఎ అధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, ఎ ఐ హబ్ గా మారనున్న నేపథ్యంలో వి ఎం ఆర్ డి ఎ అధ్వర్యంలో పి పి పి విధానంలో వర్చువల్ రియాలిటీ సెంటర్ నిర్మాణం జరపటం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు రావటంతో పర్యాటకానికి మరింత దోహదపడుతుందని అని పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ లో సొంత ఇల్లు ఉండాలని ప్రతీ ఒకరి ఆశ అని, వారి కోరిక మేరకు ఎం ఐ జీ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నగర వాసుల అభిప్రాయ సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. నగరవాసులకు నాణ్యత తో కూడిన నివాసాలను అందించనున్నామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు మూడేళ్ల లో పూర్తి కానున్నాయని, వీటి ద్వారా వి ఎం ఆర్ డి ఎ కు ఆదాయం సమకూరనుందన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, కార్యదర్శి మురళీ కృష్ణ , ఒ ఎస్ డి కృష్ణ నాయక్ , ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్ , ముఖ్య ప్రణాళిక అధికారి దివ్య లత, ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్ , పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదనరావు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.