స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుందని కొవ్వూరు నియోజకవర్గ తెలుగు యువత నాయకులు నామా సురేంద్ర కుమార్ అన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని గాడిలో పెట్టి, భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రజలకు మేలు చేస్తోందని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీలతో పాటు పెన్షన్ పెంపు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు తదితర వర్గాలకు పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, డీఎస్సీ ద్వారా 16 వేల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని నామా సురేంద్ర కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

స్వర్ణాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: నామా సురేంద్ర కుమార్
స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుందని కొవ్వూరు నియోజకవర్గ తెలుగు యువత నాయకులు నామా సురేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని గాడిలో పెట్టి, భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రజలకు మేలు చేస్తోందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు పెన్షన్ పెంపు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు తదితర వర్గాలకు పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, డీఎస్సీ ద్వారా 16 వేల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని నామా సురేంద్ర కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

