పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం
రామచంద్రాపురం మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాలలో ఈరోజు మొదలవడం జరిగినది. ఈ కార్యక్రమం ఈనెల 27వ తారీకు వరకు జరుగుతుంది. ఇందులో గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఇతర గ్రామ అన్ని శాఖల అధికారులు veterinary, vro, engineering asst, energy assistant ప్రతి ఇంటికి వెళ్లి రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ గురించి మరియు elnino ఎఫెక్ట్ గురించి వివరిస్తూ వ్యవసాయ శాఖలో చేపడుతున్న పలు పథకాలను అనగా జనుము విత్తన సరఫరా పిఎండిఎస్ విత్తనాల సరఫరా దానివల్ల ఉపయోగాలు అన్నీ కూడా రైతులకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. రామచంద్రాపురం మండలంలో సుమారు 4200 కుటుంబాల రైతులను ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి మాట్లాడడం జరుగుతుంది. తొలి రోజు RCPURAM మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ సంచాలకులు (డి ఏ ఓ), తిరుపతి, ప్రసాద రావు గారు మరియు డీపీఎం తిరుపతి షణ్ముగం గారు హాజరవ్వడం జరిగినది, కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మమత, గ్రామ వ్యవసాయ సహాయకులు భాగ్యలక్ష్మి, ఇతర గ్రామ శాఖల అధికారులు, రైతులు,APCNF (ఏపీ సీఎం అఫ్ )సిబ్బంది పాల్గొనడం జరిగినది.

