Friday, 5 June 2026
  • Home  
  • పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వేగేశ్వరపురంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు – ఎమ్మెల్సీ సోము వీర్రాజు
- తూర్పు గోదావరి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వేగేశ్వరపురంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు – ఎమ్మెల్సీ సోము వీర్రాజు

తాళ్లపూడి, జూన్ 5 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం అంటే మనల్ని మనం రక్షించుకోవడమేనని పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా మానవ మనుగడకు కీలకంగా నిలుస్తాయని అన్నారు. అదేవిధంగా నీటి వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రతి వ్యక్తి అవసరానికి మించి నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు సాధ్యమవుతాయని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ పి. రామలక్ష్మి, ఎనర్జీ అసిస్టెంట్ ఎస్. రమాదేవి, వేగేశ్వరపురం టీడీపీ సీనియర్ నాయకులు కైకాల శ్రీనివాసరావు, యువ నాయకులు అల్లూరి విక్రమాదిత్య, ఎత్తిపోతల పథకం అధ్యక్షులు ముళ్లపూడి శ్రీరామచంద్రమూర్తి, బీజేపీ ప్రధాన కార్యదర్శి గోకవరపు జితేంద్ర రవి, ఉపాధ్యక్షులు తిరుమలశెట్టి కృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు చెల్లింకుల రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సంకు దుర్గాప్రసాద్, యువ మోర్చా అధ్యక్షులు ప్రగడ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జొన్నకూటి రవితేజ, బొర్రా పోసిబాబు, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు మల్లిపూడి రాజేష్, మాజీ ప్రధాన కార్యదర్శి బాధనాల ఉమామహేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బట్టు రమేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మారం కృష్ణప్రసాద్ (కేపీ), తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నాయకులు కడలి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి పెన్నాడ నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు పనిందల లింగాచార్యులు, బొర్రా శ్రీరామచంద్రమూర్తి, బాధనాల వెంకటేశ్వరరావు, వెలుగుబంటి బాలకృష్ణ, సెక్రటరీ కొండేపాటి వెంకట సత్యనారాయణ, కిసాన్ మోర్చా నాయకులు సతీష్, బుద్దాల గాంధీ, వెంప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపూడి, జూన్ 5 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం అంటే మనల్ని మనం రక్షించుకోవడమేనని పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా మానవ మనుగడకు కీలకంగా నిలుస్తాయని అన్నారు.
అదేవిధంగా నీటి వనరులను సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రతి వ్యక్తి అవసరానికి మించి నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు సాధ్యమవుతాయని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ పి. రామలక్ష్మి, ఎనర్జీ అసిస్టెంట్ ఎస్. రమాదేవి, వేగేశ్వరపురం టీడీపీ సీనియర్ నాయకులు కైకాల శ్రీనివాసరావు, యువ నాయకులు అల్లూరి విక్రమాదిత్య, ఎత్తిపోతల పథకం అధ్యక్షులు ముళ్లపూడి శ్రీరామచంద్రమూర్తి, బీజేపీ ప్రధాన కార్యదర్శి గోకవరపు జితేంద్ర రవి, ఉపాధ్యక్షులు తిరుమలశెట్టి కృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు చెల్లింకుల రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సంకు దుర్గాప్రసాద్, యువ మోర్చా అధ్యక్షులు ప్రగడ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జొన్నకూటి రవితేజ, బొర్రా పోసిబాబు, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు మల్లిపూడి రాజేష్, మాజీ ప్రధాన కార్యదర్శి బాధనాల ఉమామహేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బట్టు రమేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మారం కృష్ణప్రసాద్ (కేపీ), తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నాయకులు కడలి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి పెన్నాడ నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు పనిందల లింగాచార్యులు, బొర్రా శ్రీరామచంద్రమూర్తి, బాధనాల వెంకటేశ్వరరావు, వెలుగుబంటి బాలకృష్ణ, సెక్రటరీ కొండేపాటి వెంకట సత్యనారాయణ, కిసాన్ మోర్చా నాయకులు సతీష్, బుద్దాల గాంధీ, వెంప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.