సేవా కార్యక్రమాలతో కోలా ఆనంద్ జన్మదిన వేడుకలుశ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ జన్మదిన వేడుకలను శనివారం నియోజకవర్గవ్యాప్తంగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలు, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. లోబావి సెంటర్లో మహిళలకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేయగా, పలు పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం, శ్రీకాళహస్తి భాస్కర్పేట హైస్కూల్లలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేసి ప్రోత్సహించారు. అదేవిధంగా ఏర్పేడు, రేణిగుంట, పాపానాయుడుపేట బస్టాండ్లు, అక్షయక్షేత్రం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో అన్నదానంతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, కోలా ఆనంద్ ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడని కొనియాడారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

సేవా కార్యక్రమాలతో కోలా ఆనంద్ జన్మదిన వేడుకలు