Friday, 19 June 2026
  • Home  
  • చికిత్స కోసం సహాయం కోరుతున్న వలస కుటుంబం
- తిరుపతి

చికిత్స కోసం సహాయం కోరుతున్న వలస కుటుంబం

శ్రీ కాళహస్తి, జూన్ 18, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని 32వ వార్డు దర్గామిట్టలో బుధవారం వీచిన ఈదురుగాలుల ప్రభావంతో భారీ వృక్షం కూలిపడి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరీష్ కుటుంబం స్థానికంగా నివాసం ఉంటుండగా, వారి పిల్లలు రిషి (5), ప్రియా (8) ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టు చిన్నారులపై పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఈ కుటుంబం వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. చిన్నారుల చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటాలని వారు దాతలను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.