శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ఎ. పుష్ప క్షేత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ బుధవారం నాడు సందర్శించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ సూచించారు. క్షేత్రస్థాయిలో విత్తన గుళికల తయారీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, స్వయంగా ఘన, ద్రవ జీవామృతం, బూడిదతో విత్తన గుళికలను తయారు చేసి పొలంలో చల్లారు. అనంతరం రైతు పుష్పతో మాట్లాడి పశుగ్రాసం లభ్యత, ఆర్థిక ప్రయోజనాలపై ఆరా తీశారు. ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలు రైతులతో కలిసి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటర్, మడక సహాయంతో పొలంలో వరి నాట్లు వేశారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల శ్రమ, ఖర్చులు తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు ‘APAIMS’ మొబైల్ యాప్ ద్వారా ఎరువుల నిల్వలను తెలుసుకుని, ముందస్తుగా బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు, ఆర్డీవో భానుప్రకాశ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

రైతులతో కలిసి వరి నాట్లు వేసిన కలెక్టర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి