శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : అన్నమయ్య నగర్లో చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. శ్రీకాళహస్తి మునిపెన్నడూ లేని విధంగా సీనియర్ స్త్రీ, పురుషుల జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ లాయర్ వెంకటస్వామి, సెక్రటరీ పసుపులేటి బాలాజీ సంయుక్త ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ జాతీయ పోటీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి స్త్రీ, పురుషుల జట్లతో పాటు ఇండియన్ రైల్వేస్ జట్లు కూడా పాల్గొంటాయి. మొత్తం 750 మంది క్రీడాకారులు, 250 మంది అధికారులు కలిపి సుమారు 1,000 మంది ఈ ఛాంపియన్‌షిప్‌నకు హాజరవుతారు. గతంలో ఈ విషయమై శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను కలవగా సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సంప్రదించిన అనంతరం త్వరలోనే పోటీల తేదీలను ప్రకటిస్తామని వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు