ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 13: అక్కంపేట గ్రామ స్మశాన భూమి అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రభుత్వ భూమిని ఆక్రమించే ఉద్దేశం లేదని నీటి సంఘం అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకుడు ఏలూరు కోదండరాంరెడ్డి స్పష్టం చేశారు. శనివారం గ్రామంలోని స్మశాన భూమిని టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ఎకరాల 50 సెంట్ల ప్రభుత్వ భూమి స్మశానానికి కేటాయించబడిందని తెలిపారు. ఇందులో అవసరమైన భూమి స్మశానానికి ఉంచి, మిగిలిన భూమిని శ్రీరాముల దేవస్థానానికి కేటాయించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన సూచనల మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అమీర్ భాష, ఆంజనేయులు, పెంచల్‌రెడ్డి, దొడ్డి రవీంద్రారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

స్మశాన భూమి అభివృద్ధే లక్ష్యం: ఏలూరు కోదండరాంరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 13: అక్కంపేట గ్రామ స్మశాన భూమి అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రభుత్వ భూమిని ఆక్రమించే ఉద్దేశం లేదని నీటి సంఘం అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకుడు ఏలూరు కోదండరాంరెడ్డి స్పష్టం చేశారు. శనివారం గ్రామంలోని స్మశాన భూమిని టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ఎకరాల 50 సెంట్ల ప్రభుత్వ భూమి స్మశానానికి కేటాయించబడిందని తెలిపారు. ఇందులో అవసరమైన భూమి స్మశానానికి ఉంచి, మిగిలిన భూమిని శ్రీరాముల దేవస్థానానికి కేటాయించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన సూచనల మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అమీర్ భాష, ఆంజనేయులు, పెంచల్‌రెడ్డి, దొడ్డి రవీంద్రారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

