Saturday, 13 June 2026
  • Home  
  • వర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు
- News

వర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు

వర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు పున్నమి న్యూస్ జూన్ 13 తెలంగాణ ఇంచార్జి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు. వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు అన్ని పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

వర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు

పున్నమి న్యూస్
జూన్ 13
తెలంగాణ ఇంచార్జి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు.

వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు అన్ని పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.

ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.