Thursday, 11 June 2026
  • Home  
  • *ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ భీకర దాడులు*
- జాతీయ అంతర్జాతీయ

*ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ భీకర దాడులు*

*అన్నంత పని చేసిన ట్రంప్…ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ భీకర దాడులు* *యుద్ధం.. మళ్లీ తీవ్రం.. ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై టెహ్రాన్ దాడులు* *హార్మూజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేసిన ఇరాన్..* దుబాయ్: భయపడినట్లే జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా బుధవారం ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ప్రతిగా.. అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దానిపై మరిన్ని భీకర దాడులు చేయబోతున్నట్లు శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడుతూ పేర్కొన్నారు. *సైనిక కేంద్రాలే లక్ష్యంగా…* తమ అపాచీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ఇరాన్పై ప్రతీకార దాడులు తప్పవని మంగళవారం ట్రంప్ చేసిన హెచ్చరికకు తగ్గట్టే.. అమెరికా యుద్ధ విమానాలు బుధవారం తెల్లవారుజామున రంగంలోకి దిగాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేశాయి. బందర్ అబ్బాస్ నగరం, కెల్మ్ దీవి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు జరిగాయని టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే తమకు ఎంత నష్టం వాటిల్లిందో మాత్రం తెలియజేయలేదు. అమెరికా దాడులతో ఆగ్రహించిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ప్రతిదాడులు చేసింది. తమ దేశంలోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చిన ఐదు క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమానాలు ఈ స్థావరంలో ఉంటాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు/క్షిపణులను తాము అడ్డుకున్నట్లు కువైట్, బహ్రెయిన్ పేర్కొన్నాయి. అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడం వల్లే అది కూలిందని స్పష్టం చేశారు. అయితే డ్రోన్తో ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా లేక పొరపాటున జరిగిందా అనేది తేలాల్సి ఉందన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. చర్చల కోసం ఖతార్ నుంచి ఓ బృందం బుధవారం టెహ్రాన్కు చేరుకుంది. *లెబనాన్ పై ఆగని ఇజ్రాయెల్ దాడులు* లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని టైర్ నగరానికి తూర్పున ఓ గ్రామంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు మృతిచెందారు.

*అన్నంత పని చేసిన ట్రంప్…ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ భీకర దాడులు*

*యుద్ధం.. మళ్లీ తీవ్రం.. ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై టెహ్రాన్ దాడులు*

*హార్మూజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేసిన ఇరాన్..*

దుబాయ్: భయపడినట్లే జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా బుధవారం ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ప్రతిగా.. అమెరికా బలగాలకు ఆతిథ్యమిస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దానిపై మరిన్ని భీకర దాడులు చేయబోతున్నట్లు శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

*సైనిక కేంద్రాలే లక్ష్యంగా…*

తమ అపాచీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ఇరాన్పై ప్రతీకార దాడులు తప్పవని మంగళవారం ట్రంప్ చేసిన హెచ్చరికకు తగ్గట్టే.. అమెరికా యుద్ధ విమానాలు బుధవారం తెల్లవారుజామున రంగంలోకి దిగాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేశాయి. బందర్ అబ్బాస్ నగరం, కెల్మ్ దీవి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు జరిగాయని టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే తమకు ఎంత నష్టం వాటిల్లిందో మాత్రం తెలియజేయలేదు.

అమెరికా దాడులతో ఆగ్రహించిన ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ప్రతిదాడులు చేసింది. తమ దేశంలోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చిన ఐదు క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమానాలు ఈ స్థావరంలో ఉంటాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు/క్షిపణులను తాము అడ్డుకున్నట్లు కువైట్, బహ్రెయిన్ పేర్కొన్నాయి.

అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడం వల్లే అది కూలిందని స్పష్టం చేశారు. అయితే డ్రోన్తో ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా లేక పొరపాటున జరిగిందా అనేది తేలాల్సి ఉందన్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. చర్చల కోసం ఖతార్ నుంచి ఓ బృందం బుధవారం టెహ్రాన్కు చేరుకుంది.

*లెబనాన్ పై ఆగని ఇజ్రాయెల్ దాడులు*

లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని టైర్ నగరానికి తూర్పున ఓ గ్రామంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు మృతిచెందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.