దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) 2026 ఏప్రిల్లో 4.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022-23ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని విడుదల చేసిన కొత్త డేటా సిరీస్లో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 5.8 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ. కొత్త సిరీస్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, గ్యాస్ సరఫరా రంగాలను కూడా చేర్చారు. తయారీ రంగం 6.2 శాతం వృద్ధిని నమోదు చేయగా, గనులు మరియు క్వారీ రంగం 5.1 శాతం క్షీణించింది. విద్యుత్, గ్యాస్ సరఫరా రంగాలు కూడా వృద్ధిని కనబర్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.

పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మందగింపు.. కొత్త డేటా సిరీస్లో 4.9 శాతం నమోదు