బద్వేల్ టీడీపీలో వర్గ విభేదాలు.. మహానాడు వేళ రాజకీయ వేడి..!
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీడీపీ ఇంచార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మధ్య కొనసాగుతున్న వర్గ పోరు మహానాడు కార్యక్రమం సందర్భంగా మరింత చర్చనీయాంశమైంది. రేపు జరిగే మహానాడు ఏర్పాట్ల పూర్తి బాధ్యతలను పార్టీ అధిష్టానం సూర్యనారాయణ రెడ్డికి అప్పగించడంతో రితీష్ వర్గం కార్యక్రమానికి హాజరవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ జోనల్ ఇంచార్జ్ శ్రీనివాసుల రెడ్డి, పరిశీలకుడు నాగేంద్ర ఒకవైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారంతో సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బద్వేల్ టీడీపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.

బద్వేల్ టీడీపీలో వర్గ విభేదాలు.. మహానాడు వేళ రాజకీయ వేడి..! వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీడీపీ ఇంచార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మధ్య కొనసాగుతున్న వర్గ పోరు మహానాడు కార్యక్రమం సందర్భంగా మరింత చర్చనీయాంశమైంది. రేపు జరిగే మహానాడు ఏర్పాట్ల పూర్తి బాధ్యతలను పార్టీ అధిష్టానం సూర్యనారాయణ రెడ్డికి అప్పగించడంతో రితీష్ వర్గం కార్యక్రమానికి హాజరవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ జోనల్ ఇంచార్జ్ శ్రీనివాసుల రెడ్డి, పరిశీలకుడు నాగేంద్ర ఒకవైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారంతో సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బద్వేల్ టీడీపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.