గార్లఒడ్డు లో కొబ్బరి మొక్కలు దగ్ధం
ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైతు భూక్య లాలు నాయక్ సాగు చేస్తున్న సుమారు మూడు ఎకరాల గట్లపై నాటిన సుమారు 100 కొబ్బరి మొక్కలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే వ్యవసాయానికి ఉపయోగించే పైపులు, మోటారు, స్టార్టర్ కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే వ్యవసాయ అధికారి నరసింహారావు, పోలీసు సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతుకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.


