ప్రొద్దుటూరు(M) కల్లూరులో మహిళ మృతిపై ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ స్వయంగా విచారణ చేపట్టారు. గురువారం ఉదయం మహిళ మృతి సమాచారం రాగానే ఏఎస్పీ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. మృతురాలికి అదే గ్రామానికి చెందిన పాలెం రమాదేవి. ఆమెను కుమార్తె సురేఖ గుర్తించారు.
మృతురాలికి మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఏఎస్పీ వెంట రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్ఐలు ఉన్నారు.


