జిల్లాలో అర్హులైన మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లోని మత్స్యకార గ్రామాల నుంచి వివరాలు సేకరించగా, మొదట 13,108 మందిని గుర్తించారు. పరిశీలన అనంతరం 11,644 మంది అర్హులు, 1,464 మంది అనర్హులుగా తేల్చారు. అర్హులైన వారు ఈనెల 18లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

మత్స్యకారులకు వేట నిషేధ భృతి