ఖమ్మం, మే
( పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి):
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2018లో నిర్వహించిన గ్లోబల్ మోబిలిటీసుమ్మిట్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గేంటెల విద్యాసాగర్ కోరారు.
ప్రధాని మోదీ పిలుపును ఆదర్శంగా తీసుకున్న ఖమ్మం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, అప్పటి నుంచే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న క్రూడ్ ఆయిల్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు మరియు పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా ప్రజలు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై దృష్టి సారించాలని గేంటెల విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు.


