Wednesday, 13 May 2026
  • Home  
  • మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకులు
- తిరుపతి

మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ మంత్రితో సమావేశమై జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి, స్థానిక రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి క్షేత్ర పర్యాటక అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి జయప్రకాశ్, ప్రముఖ నాయకులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.