శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర కార్మిక, బాయిలర్లు, భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు హోటల్ ఎంజీఎం గ్రాండ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున నాయుడు పుష్పగుచ్చం అందించి మంత్రిని ఆహ్వానించారు. అనంతరం ఆలయ దర్శనం చేసిన మంత్రి, హోటల్ ఎంజీఎం గ్రాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన రుద్రాక్ష వనాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లికార్జున నాయుడు మంత్రికి 36 రుద్రాక్షలతో కూడిన ప్రత్యేక మాలను బహుకరించారు. ఆలయ పరిసరాల్లో రుద్రాక్ష చెట్లను పెంచి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సేవలను గుర్తిస్తూ మల్లికార్జున నాయుడిని శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఈఎస్ఐ నిబంధనల్లో కీలక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇకపై ఉద్యోగుల తల్లిదండ్రులతో పాటు అత్తమామలకు కూడా ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయం కార్మిక కుటుంబాలకు మరింత భరోసా కలిగిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఎంజీఎం ఆసుపత్రిలో కూడా ఈఎస్ఐ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా కార్మిక శాఖ అధికారులు, ఎంజీఎం గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఘన స్వాగతం