Wednesday, 13 May 2026
  • Home  
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- రాజన్న సిరిసిల్ల

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ముస్తాబాద్ మే 13 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్స్‌లో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వధూవరులు జీవితాంతం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలు, పరస్పర ప్రేమాభిమానాలతో కొత్త జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ముస్తాబాద్ మే 13 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్స్‌లో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వధూవరులు జీవితాంతం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలు, పరస్పర ప్రేమాభిమానాలతో కొత్త జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీర్వదించారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.