తొట్టంబేడు, మే 07 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండల పరిధిలో రహదారి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. శ్రీకాళహస్తి–పిచాటూరు ప్రధాన రహదారిలోని శివనాథపురం గ్రామం వద్ద గురువారం తొట్టంబేడు సీఐ తిమ్మయ్య ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపై భారీ జరిమానాలతో పాటు రిమాండ్‌కు తరలించే చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగం నివారించాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రహదారులపైకి వచ్చే వారిపై చలానాలు విధిస్తామని పేర్కొన్న సీఐ, ప్రజలు తమ భద్రత కోసం నిబంధనలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరారు.

మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే జైలుశిక్ష తప్పదు-సీఐ తిమ్మయ్య హెచ్చరిక