తాళ్లపూడి పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా,మే 6: తాళ్లపూడి మండలంలోని రైతులు మిల్లులకు ధాన్యం తరలించిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిద్దా దుర్గా ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్‌ఎస్‌కే కేంద్రాల ద్వారా రైతులు తమకు అనుకూలమైన మిల్లులకు ధాన్యం పంపితే చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అవగాహన లేక కొందరు నేరుగా మిల్లులకు తరలించి ఆలస్యంపై అపోహలు పెంచుతున్నారని అన్నారు. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారిక విధానాలను అనుసరించాలని సూచించారు.

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు: సిద్దా దుర్గా ప్రసాద్