Saturday, 2 May 2026
  • Home  
  • గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఘనంగా పూజలు, జీవిత చరిత్ర గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఘనంగా పూజలు, జీవిత చరిత్ర గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 2 ( మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ అభివృద్ధి, సేవా కార్యక్రమాలను పరిశీలించారు. విశ్వంభరుడు పేరుతో దంపూరు రామకృష్ణ రచించిన జీవిత చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించి రచయితను సత్కరించారు. ఆశ్రమంలో జరుగుతున్న విద్య, వైద్య, అన్నదాన సేవలను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 2 ( మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ అభివృద్ధి, సేవా కార్యక్రమాలను పరిశీలించారు. విశ్వంభరుడు పేరుతో దంపూరు రామకృష్ణ రచించిన జీవిత చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించి రచయితను సత్కరించారు. ఆశ్రమంలో జరుగుతున్న విద్య, వైద్య, అన్నదాన సేవలను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.