వింజమూరు
Date:02-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
వింజమూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనకు నూతన బాధ్యతలపై శుభాకాంక్షలు తెలియజేసి, వింజమూరు ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించాను.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజలతో సాన్నిహిత్యంతో “ఫ్రెండ్లీ పోలీసింగ్” అమలు చేస్తూ, సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు . సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు . ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడం ప్రతి పోలీసు అధికారి ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు.


