ఏర్పేడు, మే 01 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం సీతారామపేట గ్రామంలో వెలసిన శ్రీ పాండురంగ స్వామి వారి అగ్నిగుండ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని, అర్చకుల వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్నిగుండంలో ప్రవేశం చేస్తున్న భక్తుల ఆత్మీయ భక్తిశ్రద్ధలను చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, పాండురంగ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీతారామపేట అగ్నిగుండ మహోత్సవం వైభవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి