ఏర్పేడులో స్థానిక ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర హోమియోపతి పరిశోధనా మండలి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పేడులో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి మండల పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకున్నారు. శిబిరంలో ముఖ్యంగా కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, థైరాయిడ్, రక్తహీనత వంటి సమస్యలతో పాటు దీర్ఘకాలిక మూత్రపిండ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు చేపట్టారు. చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి తల్లిదండ్రులకు తగిన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ డాక్టర్ రవిచంద్ర రెడ్డి, డాక్టర్ హారిక, డాక్టర్ వసంత పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులను సమూలంగా నయం చేయవచ్చని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోతుల రాజకుమార్, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, శిబిరానికి వచ్చిన వారికి నిర్వాహకులు ప్రత్యేకంగా గిఫ్ట్ బ్యాగులను అందజేయడం విశేషం.

ఏర్పేడులో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం-ప్రజల విశేష స్పందన