మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల తెలిపారు. అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సూచనల మేరకు శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాల్లో మహిళలు, విద్యార్థినిలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు.



