పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలంవెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాగాలలో గురువారం నాడు కేరీర్ గైడెన్స్, ప్లేస్ మెంట్ & ట్రైనింగ్ సెల్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన లయనిక్స్ ఎల్.ఎల్. పి సంస్థ ప్రాంగణ ఎంపికల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయనిక్స్ సంస్థ తరపున హెచ్ ఆర్ మేనేజర్ విజయ్ కుమార్, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సతీష్ పాల్గోని గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ మరియు హెచ్ ఆర్ ఇంటర్వూ రౌండ్లు చేపట్టారు. ఉద్యోగాలకు ఎంపికైన మంది . 65 విద్యార్థులకు నియామక పత్రిలను అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనంగా రూ.2.5 లక్షలు వేతనంగా అందజేయ నున్నట్లు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో బి. ఫార్మసీ, ఫార్మా & చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయకిన్స్ సంస్థ ప్రతినిధులు , కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రసన్నరాజు, పరీక్షల నియంత్రణాధికారి సతీష్ కుమార్ పాల్గన్నారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు.




