విజయవాడ/గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్
ఈనెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో మూడు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ ప్లీనరీ సమావేశాలకు హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సాదరంగా ఆహ్వానించారు.బుధవారం సాయంత్రం విజయవాడలోని ఎమ్మెల్యే నివాసంలో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, జనరల్ సెక్రెటరీ సోమసుందర్ తదితరులు యార్లగడ్డ వెంకట్రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్లీనరీ ఆహ్వాన పత్రాన్ని అందజేసి, మూడు రోజుల పాటు జరిగే సమావేశాల విశేషాలను వివరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు:
ఈ నెల 28వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. జర్నలిస్టుల జాతీయ స్థాయి సమావేశాలు విజయవాడలో నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా హాజరవుతానని ఆయన నిర్వాహకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు అట్లూరి రాజశేఖర్, కోడూరి రామకృష్ణ, నల్లగంచు రామకృష్ణ నిర్వహించారు.

ఐజేయూ ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే యార్లగడ్డకు ఆహ్వానం
విజయవాడ/గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ ఈనెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో మూడు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ ప్లీనరీ సమావేశాలకు హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సాదరంగా ఆహ్వానించారు.బుధవారం సాయంత్రం విజయవాడలోని ఎమ్మెల్యే నివాసంలో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, జనరల్ సెక్రెటరీ సోమసుందర్ తదితరులు యార్లగడ్డ వెంకట్రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్లీనరీ ఆహ్వాన పత్రాన్ని అందజేసి, మూడు రోజుల పాటు జరిగే సమావేశాల విశేషాలను వివరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు: ఈ నెల 28వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. జర్నలిస్టుల జాతీయ స్థాయి సమావేశాలు విజయవాడలో నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా హాజరవుతానని ఆయన నిర్వాహకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు అట్లూరి రాజశేఖర్, కోడూరి రామకృష్ణ, నల్లగంచు రామకృష్ణ నిర్వహించారు.

