విశాఖ గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి)
జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని తలారి వాని పాలెం వద్ద ఏపీ టిట్కో ఇళ్ల అప్పగింత కార్యక్రమం సోమవారం (30వ తేదీ) ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, బీజేపీ ఇన్‌చార్జ్ కరణం రెడ్డి నరసింహారావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కూటమి పార్టీలకు చెందిన మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు ఇన్‌చార్జీలు, రాష్ట్ర–జిల్లా నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.



