Wednesday, 18 February 2026
  • Home  
  • రాజన్న సిరిసిల్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
- రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కె చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.కేక్ కట్ చేస్తూ “కేసీఆర్ మా శ్వాస… తెలంగాణ మా గర్వం” అనే నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగింది.ఈ సందర్భంగా మొక్కలు నాటి పచ్చ తెలంగాణ సాధనకు సంకల్పం వ్యక్తం చేశారు. తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన మహానేతకు ఇదే మా గౌరవ వందనం అని పేర్కొన్నారు. ఆయన చూపిన దారిలోనే ముందుకు సాగుతూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాఫ్కప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, బొల్లి రామ్మోహన్, సత్తర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు భారీగా హాజరై కే సి ఆర్ జన్మదిన వేడుకను విజయవంతం చేశారు.

రాజన్న సిరిసిల్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కె చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.కేక్ కట్ చేస్తూ “కేసీఆర్ మా శ్వాస… తెలంగాణ మా గర్వం” అనే నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగింది.ఈ సందర్భంగా మొక్కలు నాటి పచ్చ తెలంగాణ సాధనకు సంకల్పం వ్యక్తం చేశారు.
తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన మహానేతకు ఇదే మా గౌరవ వందనం అని పేర్కొన్నారు. ఆయన చూపిన దారిలోనే ముందుకు సాగుతూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాఫ్కప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, బొల్లి రామ్మోహన్, సత్తర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు భారీగా హాజరై కే సి ఆర్ జన్మదిన వేడుకను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.