పున్నమి ప్రతినిధి:
బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా సంగెం రాజు
ఇబ్రహీంపట్నం బీసీ సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షునిగా యాచారం మండలానికి చెందిన నానక్ నగర్ గ్రామానికి చెందిన సంగెం రాజు నియమితులయ్యారు.శనివారం ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సంగెం రాజును ప్రకటించి ఆర్ .కృష్ణయ్య ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బీసీ సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించినందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీల హక్కు కోసం ఆర్.కృష్ణయ్య చేసే ప్రతి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. బీసీల ఐక్యత, బీసీ సమస్యల పరిష్కారం, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో నానక్ నగర్ సర్పంచ్ సంగెం చైతన్య, ప్రవీణ్ అభిలాష్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.



