వి.ఆర్.సి పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0
చదువు తో పాటు పిల్లల సమగ్ర వికాసమే ప్రభుత్వ ధ్యేయం.
కార్పొరేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు.
పిల్లల చదువుపై తల్లిదండ్రులు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం.
ఉచిత బస్సు సౌకర్యం నుండి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వరకు విద్యా రంగానికి యువనేత నారా లోకేష్ పెద్దపీట వేస్తున్నారు
నెల్లూరులోని వి.ఆర్.సి పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (PTM 4.0) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రగతిపై ఆరా తీసారు.తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చి పిల్లల పురోగతిని తెలుసుకోవడాన్ని అభినందించారు; విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేశారు.అనంతరం రమాదేవి మాట్లాడుతూ మూతబడిన విఆర్సిని నారాయణ సార్ పట్టుదలతో కృషిచేసి అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశారన్నారు.1100 మంది నిరుపేద పిల్లలకు అడ్మిషన్స్ కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు.
ఉదయాన్నే పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలు టిఫిన్ చేయకుండా వస్తే చదువుపై ఏకాగ్రత చూపలేరనే ఉద్దేశంతో ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్, అలాగే బడికి రాకపోకల కోసం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని వివరించారు. అంతేకాకుండా, సాధారణ మెటీరియల్స్ బండిల్స్ ఇవ్వకుండా,నారాయణ గ్రూప్‌కు చెందిన R&D టీమ్ నిపుణులతో ప్రత్యేకంగా వర్కవుట్ చేయించి విద్యార్థుల స్థాయికి తగిన నాణ్యమైన మెటీరియల్‌ను అందిస్తున్నామని చెప్పారు.పెదపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ కుటుంబ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్,అడిషనల్ కమిషనర్ హిమ బిందు,ప్రిన్సిపాల్ వెంకట్రావు,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,జిల్లా మార్కెటింగ్ కమిటీ మెంబర్ గుణుకుల విజయలక్ష్మి,బీజేపీ మహిళా నేత రాజేశ్వరి,టీడీపీ నేతలు యశ్వంత్ రెడ్డి,డాక్టర్ పోకల రవి,సుజన్ కుమార్,దర్శి హరికృష్ణ ,ఏడుకొండలు,
ఉపాధ్యాయులు
పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





