Tuesday, 8 September 2026
  • Home  
  • మాగనూర్, కృష్ణ మండలాల్లో రేపు ఎంపీ డీకే అరుణమ్మ పర్యటన అభివృద్ధి పనులకు భూమి పూజ
- నారాయణపేట

మాగనూర్, కృష్ణ మండలాల్లో రేపు ఎంపీ డీకే అరుణమ్మ పర్యటన అభివృద్ధి పనులకు భూమి పూజ

మాగనూర్, కృష్ణ మండలాల్లో ఎంపీ డీకే అరుణమ్మ రేపు పర్యటించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షులు జయానంద్ రెడ్డి, నల్లె నర్సప్ప తెలిపారు. మాగనూర్ మండలం నేరడ్గం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణ మండల కేంద్రంలోని కృష్ణ నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి దేవాలయం సమీపంలో భవిష్యత్ కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కర్మకాండలు నిర్వహించేందుకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి మండలంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

మాగనూర్, కృష్ణ మండలాల్లో ఎంపీ డీకే అరుణమ్మ రేపు పర్యటించనున్నట్లు మండల బీజేపీ అధ్యక్షులు జయానంద్ రెడ్డి, నల్లె నర్సప్ప తెలిపారు. మాగనూర్ మండలం నేరడ్గం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణ మండల కేంద్రంలోని కృష్ణ నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి దేవాలయం సమీపంలో భవిష్యత్ కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కర్మకాండలు నిర్వహించేందుకు ఎంపీ నిధులతో నిర్మించనున్న కామన్ వర్క్ షెడ్‌కు భూమి పూజ చేయనున్నారు.
ఈ కార్యక్రమాలకు ఉమ్మడి మండలంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.