*317 బదిలీలపై స్పష్టత, భాషా పండితుల భార్యాభర్తల బదిలీలు వెంటనే చేపట్టాలి*
*రాష్ట్ర అధ్యక్షులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు డిమాండ్*
*పున్నమి ప్రతినిధి వనపర్తి::29/12/2025*
*ఈరోజు పాలమూరు జిల్లాలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయ కుమార్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలోని సభ్యులందరూ అనేక విషయాలపై చర్చించి ప్రధానంగా ఈ క్రింది విషయాలపై ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర గౌరవ సలహాదారులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ గాలి్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి తీర్మానాన్ని సమర్పించి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలాగా సహకరించాలని కోరడం జరిగింది*
1. *317 జీవో అమలులో భాగంగా వివిధ జిల్లాలకు కేటాయించబడ్డ భార్యాభర్తలను సొంత జిల్లాకు కేటాయించాలి*
2. *సొంత జిల్లా కోల్పోయిన భాషా పండితులు ప్రమోషన్ పొందిన కారణంతో డిప్యూటేషన్కు దూరమైనందున 190 జీవోని సవరించి భాష పండితులు కూడా తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలి*
*పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గారి సమన్వయంతో ఏర్పాటయినాయి కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు*


