Friday, 27 March 2026
  • Home  
  • బిజెపి నాయకుల ఆగ్రహం: ఖమ్మం కూరగాయల మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఘాటుగా ఖండన:
- ఖమ్మం

బిజెపి నాయకుల ఆగ్రహం: ఖమ్మం కూరగాయల మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఘాటుగా ఖండన:

ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలోని వీధి వ్యాపారుల ప్రాంగణ మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరువ్యాపారులపై జరుగుతున్న అన్యాయ వసూళ్లు, బెదిరింపులు పెరుగుతున్నాయనే సమాచారం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, తెలంగాణ బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ్ రావు, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రతి నిధుల బృందం మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారుల నుంచి రసీదు లేకుండా ఒక్కొక్కరి దగ్గర ₹10,000 చొప్పున వసూలు చేసినట్టు వచ్చిన ఫిర్యాదులు అత్యంత ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఎలాంటి అధికారిక రికార్డులు, రసీదులు ఇవ్వకపోవడం తీవ్ర అవకతవకలకు నిదర్శనమని తెలిపారు. అదనంగా, పాత వ్యాపారులను బయటకు పంపి కొత్త వ్యక్తులను మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు పేద వ్యాపారుల జీవనాధారాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు నాలుగు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు— వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాల వెల్లడి. రసీదు లేకుండా డబ్బులు వసూలు చేసిన అధికారులపై దర్యాప్తు. పాత వ్యాపారులను తొలగించే చర్యలకు తక్షణ విరమణ. పేద వ్యాపారుల జీవనాధార రక్షణకు ప్రభుత్వ హామీ. పేదలపై అన్యాయం జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కానీ కఠినమైన పోరాటం చేస్తామని బిజెపి నేతలు హెచ్చరించారు.

ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలోని వీధి వ్యాపారుల ప్రాంగణ మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరువ్యాపారులపై జరుగుతున్న అన్యాయ వసూళ్లు, బెదిరింపులు పెరుగుతున్నాయనే సమాచారం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, తెలంగాణ బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ్ రావు, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రతి నిధుల బృందం మార్కెట్‌ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు.

వ్యాపారుల నుంచి రసీదు లేకుండా ఒక్కొక్కరి దగ్గర ₹10,000 చొప్పున వసూలు చేసినట్టు వచ్చిన ఫిర్యాదులు అత్యంత ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఎలాంటి అధికారిక రికార్డులు, రసీదులు ఇవ్వకపోవడం తీవ్ర అవకతవకలకు నిదర్శనమని తెలిపారు. అదనంగా, పాత వ్యాపారులను బయటకు పంపి కొత్త వ్యక్తులను మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు పేద వ్యాపారుల జీవనాధారాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

బిజెపి నాయకులు నాలుగు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు—
వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాల వెల్లడి.
రసీదు లేకుండా డబ్బులు వసూలు చేసిన అధికారులపై దర్యాప్తు.
పాత వ్యాపారులను తొలగించే చర్యలకు తక్షణ విరమణ.
పేద వ్యాపారుల జీవనాధార రక్షణకు ప్రభుత్వ హామీ.
పేదలపై అన్యాయం జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కానీ కఠినమైన పోరాటం చేస్తామని బిజెపి నేతలు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.