రాజంపేటలోని కళాంజలి కళ్యాణ మండపంలో ఆదివారం నాడు జరిగిన పల్లె కుటుంబ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది. పల్లె నాగమోహన్ కుమారుడు సాయి కృష్ణ – దేవిక దంపతుల వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.కళ్యాణ వేదికపై వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి, నూతన దంపతులు సుఖసంతోషాలతో కొత్త జీవన ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.కుటుంబ బాంధవ్యాలు మరింత బలపడేలా పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని సూచించారు.
వివాహ వేడుకకు లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య,పల్లె సుబ్రహ్మణ్యం, టిడిపి పార్టీ దళిత నాయకుడు సాతపల్లి వెంకీతో పాటు మోహన్,మురళి,పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

పల్లె వారి పెళ్లి సన్నిధిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి
రాజంపేటలోని కళాంజలి కళ్యాణ మండపంలో ఆదివారం నాడు జరిగిన పల్లె కుటుంబ వివాహ వేడుకలో నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది. పల్లె నాగమోహన్ కుమారుడు సాయి కృష్ణ – దేవిక దంపతుల వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.కళ్యాణ వేదికపై వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి, నూతన దంపతులు సుఖసంతోషాలతో కొత్త జీవన ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.కుటుంబ బాంధవ్యాలు మరింత బలపడేలా పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని సూచించారు. వివాహ వేడుకకు లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య,పల్లె సుబ్రహ్మణ్యం, టిడిపి పార్టీ దళిత నాయకుడు సాతపల్లి వెంకీతో పాటు మోహన్,మురళి,పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

