Friday, 7 August 2026
  • Home  
  • ముథోల్లో ఆషాడ మాస గోరింటాకు సంబురాల సందడి
- నిర్మల్

ముథోల్లో ఆషాడ మాస గోరింటాకు సంబురాల సందడి

ముథోల్, ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి ):ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ముథోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్‌)లో శుక్రవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై చేతులకు గోరింటాకు పెట్టించుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా, విద్యార్థినులు జానపద గీతాలు, సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. గోరింటాకు ప్రాముఖ్యత, ఆషాడ మాస విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం కూడా విద్యలో భాగమేనని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.

ముథోల్, ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి ):ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ముథోల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్‌)లో శుక్రవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై చేతులకు గోరింటాకు పెట్టించుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా, విద్యార్థినులు జానపద గీతాలు, సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. గోరింటాకు ప్రాముఖ్యత, ఆషాడ మాస విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం కూడా విద్యలో భాగమేనని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.