మద్యం షాపులు వద్దని వెలసిన బ్యానర్లు
పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్
20 నవంబర్ 2025, భద్రాచలం
కోచింగ్ సెంటర్ గుడి ప్రాంతంలో మద్యం అమ్మకాలు
విద్యార్థులు ఉపాధ్యాయులు తొలగించాలని ఆందోళన ప్లెక్సీలు
కదలని సిండికేట్ చీకటి వ్యాపారస్తులు
ప్రజల తిరుగుబాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిందే
భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్డు ముందు ఎస్ ఎస్ కోచింగ్ సెంటర్ నిత్యం విద్యార్థులు విద్యని
అభ్యసించే కోచింగ్ సెంటర్, అలాగే అక్కడే శివాలయం భక్తులు నిత్యం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావంతో పెద్ద ఎత్తున ఆ గుడికి వస్తుంటారు. కానీ అక్కడే అనుమతులు లేని మద్యం బెల్ట్ షాపులు, బార్ షాపులు దర్శనమిస్తున్నాయి. అక్కడికి పెద్ద ఎత్తున మద్యం సేవించేందుకు మద్యం ప్రియులు నిత్యం సంచరిస్తున్నారు. అలాగే వారు తాగి అక్కడ గొడవలు పడటం వచ్చిపోయే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి అనేక సంఘటనకు ఆ ప్రాంతం
నెలవుగా మారింది. ఈ ప్రాంతం గుడికి కోచింగ్ సెంటర్ కి ఆటంకంగా ఉండటం వలన అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ ప్రాంతంలో బార్ షాపులు కానీ, బెల్ట్ షాపులు గాని పెట్టవద్దని వారి యొక్క నిరసన తెలుపుతున్నారు. అయినా సరే వారి నిరసనను పెడచెవిన పెట్టి మద్యం దుకాణదారులు వారు ఇష్టానుసారంగా మద్యం ఏరులై పారించటం పరిపాటిగా మారింది. అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహణ పెద్ద ఎత్తున కొనసాగుతా ఉన్నాయి. వీటిని ప్రశ్నించే వారే లేకపోవడం గమనహర్గం. అధికారులు ఉండి కూడా గుడి, బడి వద్ద మద్యం లైసెన్స్ ను ఇవ్వటం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. అధికారులు ఆలోచన చేయాల్సి ఉంది. ఏ రకంగా అయినా సరే అమ్ముకోమని ధోరణి కనిపిస్తుంది. చదువుకునే పిల్లలకు దీనివల్ల ఏ సంకేతం వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి లేకపోలేదు శివాలయానికి వస్తున్న భక్తులకు కూడా తాగి దర్శనం ఇయ్యటం ఒకింత బాధని కలిగిస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వాదన బలంగా వినిపిస్తుంది. తక్షణమే ఎక్సైజ్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అక్కడ అంతరాయంగా ఉన్న మద్యం బెల్ట్ షాపులను తొలగించే ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫ్లెక్సీల ద్వారా వారి నిరసన ను వ్యక్తపరుస్తున్నారు.


