పున్మమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గయ్య
ఆంధ్రా స్థానికత గల హోంగార్డుల బదిలీకి సహకరించండి..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెంది తెలంగాణా లో పనిచేస్తున్న హోమ్ గార్డులను సొంత రాష్ట్రానికి బదిలీ చేసేలా ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని సంఘం ప్రతినిధులు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కలసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోం గార్డు ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యామని, రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత మేము తెలంగాణలో ఉండిపోవలసి వచ్చిందని వారు ఆయనకి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగింది. కాని హోంగార్డులను మార్చలేదు. మా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దీనివలన మేము ఉద్యోగం తెలంగాణలో, కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉండటంవలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటికి రవాటానికి రవాణపరంగా మరియి ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. మా తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, మేము వారిని చూసుకోలేకపోతున్నాము. వారు..ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణలో ఉంటున్నాము. మాలో కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రామకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలియజేశారు.

ఆంధ్రా స్థానికత గల హోంగార్డుల బదిలీకి సహకరించండి
పున్మమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గయ్య ఆంధ్రా స్థానికత గల హోంగార్డుల బదిలీకి సహకరించండి.. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెంది తెలంగాణా లో పనిచేస్తున్న హోమ్ గార్డులను సొంత రాష్ట్రానికి బదిలీ చేసేలా ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని సంఘం ప్రతినిధులు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కలసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోం గార్డు ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యామని, రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత మేము తెలంగాణలో ఉండిపోవలసి వచ్చిందని వారు ఆయనకి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగింది. కాని హోంగార్డులను మార్చలేదు. మా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దీనివలన మేము ఉద్యోగం తెలంగాణలో, కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉండటంవలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటికి రవాటానికి రవాణపరంగా మరియి ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. మా తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, మేము వారిని చూసుకోలేకపోతున్నాము. వారు..ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణలో ఉంటున్నాము. మాలో కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రామకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలియజేశారు.

