.
విశాఖ అక్టోబర్ పున్నమి ( ప్రతినిధి)
గత తేదీ 16-10-2025 న రాత్రి సుమారు 21:00 గంటలకు, అక్రమంగా లిక్విడ్ గంజాయి ను కలిగి ఉండటం మరియు రవాణా చేయడం గురించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, టాస్క్ ఫోర్స్ బృందం, గాజువాక పీఎస్ లిమిట్స్, శ్రీ నగర్, గార్బేజ్ వెహికల్ పార్కింగ్ యార్డు వద్ద ఒక డికాయ్ ఆపరేషన్ నిర్వహించింది. సదరు ప్రదేశంలో అనుమానాస్పద పరిస్థితులలో ఉన్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకుని, వారి నుండి లిక్విడ్ గంజాయి ను స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల కోసం లిక్విడ్ గంజాయితో పాటు నిందితులను గాజువాక పోలీసు అప్పగించడం జరిగింది.నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు: గంజాయి నూనె (Hash Oil): 04 లీటర్ల బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్-01
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్-01
సెల్ ఫోన్లు: 05 (ఆండ్రాయిడ్-04, కీప్యాడ్-01)
అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు:
01.కురచ హేమ కుమార్, వయస్సు: 28 సం., చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా.
02.కొలుపూరి వరాహ మూర్తి, వయస్సు: 27 సం.,చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా.
03.కురచ సంజీవ్, వయస్సు: 26 సం.,చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా.
04.వంతల కొండబాబు @ మన్మధ, వయస్సు: 35 సం., జి.మాడుగుల మండలం. విశాఖ నగరంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు రాకుండా మరియు ఎవరు వాటి బారిన పడకుండా ఉండాలని పోలీసు కమిషనర్ . పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది, నగర పరిధిలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్ధాలు ఎవరివద్దనైనా కలిగి ఉన్నట్లు అనుమానం ఉంటే నేరుగా డయల్ -100/112 కు గాని, సీపీ గారి ఫోన్ నెంబర్ 7995095799 గాని లేదా దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని, అలా సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందనీ నగర పోలీసుల విజ్ఞప్తి. నగర పోలీసు తరపున, విశాఖపట్నం సిటీ.


