Thursday, 14 May 2026
  • Home  
  • 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు డా. పీర్ కుమార్ కు ఆహ్వానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

7వ ప్రపంచ తెలుగు మహాసభలకు డా. పీర్ కుమార్ కు ఆహ్వానం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు @ మే14 వచ్చేనెల జూన్ 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరగ నున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో పాల్గొనేందుకు వేదాయపాలెం నెల్లూరుకు చెందిన కవి, రచయిత, నటులు మరియు అధ్యాపకులు డాక్టర్ బద్రి పీర్ కుమార్ కు ఆహ్వానం అందింది. ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు రాజ మహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ శ్రీశ్రీ కళావేదికలో జూన్ 6 మరియు 7 వ తేదీలలో జరుగునని పీర్ కుమార్ పేర్కొన్నారు. చైతన్య సారస్వత పరిషత్ వారి సౌజన్యంతో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు కవులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిభ కనపరచిన వారికి కళా పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందచేస్తారని, సాహిత్య విభాగంలో ప్రపంచ తెలుగు కవి సమ్మేళనం, సాహిత్య సదస్సులు, పత్ర సమర్పణ, పుస్తకావిష్కరణలు, పద్య కవిసమ్మేళనం, బాల/యువ కవిసమ్మేళనం అస్టావదానం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమాలపై కవితలు వినిపించవలసి ఉంటుందని పీర్ కుమార్ తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు @ మే14
వచ్చేనెల జూన్ 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరగ నున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో పాల్గొనేందుకు వేదాయపాలెం నెల్లూరుకు చెందిన కవి, రచయిత, నటులు మరియు అధ్యాపకులు డాక్టర్ బద్రి పీర్ కుమార్ కు ఆహ్వానం అందింది. ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు రాజ మహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ శ్రీశ్రీ కళావేదికలో జూన్ 6 మరియు 7 వ తేదీలలో జరుగునని పీర్ కుమార్ పేర్కొన్నారు. చైతన్య సారస్వత పరిషత్ వారి సౌజన్యంతో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు కవులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిభ కనపరచిన వారికి కళా పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందచేస్తారని, సాహిత్య విభాగంలో ప్రపంచ తెలుగు కవి సమ్మేళనం, సాహిత్య సదస్సులు, పత్ర సమర్పణ, పుస్తకావిష్కరణలు, పద్య కవిసమ్మేళనం, బాల/యువ కవిసమ్మేళనం అస్టావదానం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమాలపై కవితలు వినిపించవలసి ఉంటుందని పీర్ కుమార్ తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.