తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 13: తాళ్లపూడి మండల పరిధిలో బుధవారం పలు ఇసుక రీచ్‌లను జిల్లా గనుల మరియు భూగర్భ శాఖ అధికారి భూపేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన ఓపెన్ సాండ్ రీచ్‌లు, డీ-సిల్టేషన్ రీచ్‌లు మరియు పట్టా భూముల్లో మాత్రమే నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇసుక తవ్వకాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని, అనుమతులు పొందిన రీచ్‌ల జాబితాను కూడా వెల్లడించినట్లు పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీలలో ఏడి వెంకట్, మైన్స్ ఏజీ ఇంజనీర్, టాస్క్ ఫోర్స్ ఎస్సై సత్యనారాయణ, మైన్స్ సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలకు తావులేదు జిల్లా గనుల శాఖ అధికారి భూపేష్ రెడ్డి
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 13: తాళ్లపూడి మండల పరిధిలో బుధవారం పలు ఇసుక రీచ్‌లను జిల్లా గనుల మరియు భూగర్భ శాఖ అధికారి భూపేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన ఓపెన్ సాండ్ రీచ్‌లు, డీ-సిల్టేషన్ రీచ్‌లు మరియు పట్టా భూముల్లో మాత్రమే నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇసుక తవ్వకాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని, అనుమతులు పొందిన రీచ్‌ల జాబితాను కూడా వెల్లడించినట్లు పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఏడి వెంకట్, మైన్స్ ఏజీ ఇంజనీర్, టాస్క్ ఫోర్స్ ఎస్సై సత్యనారాయణ, మైన్స్ సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

