ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని పెనుబల్లి మండల కేంద్రం లో గల రాజసాయి మందిరం చైర్మన్ శ్రీమతి జెన్నారెడ్డి విజయ రెడ్డి గుండె పోటు తో మరణించారు. కుమారుని యొక్క జ్ఞాపకం గా వంగముత్యాల బంజర్ లో 25 ఎళ్ల క్రితం *రాజసాయి మందిరం ని నిర్మించి ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహిస్తు ఎంతో మందికి కంటి చూపు ని బాగుచేసి వారిని తిరిగి లోకాన్ని చూసే ల చేశారు. అలాంటి మహా వ్యక్తి శ్రీమతి జెన్నారెడ్డి విజయ రెడ్డి ని గుండె పోటు రూపం లో ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి సేవలు పొందిన ఎందరో ప్రజలు కోరుకుంటున్నారూ. వారి జీవిత భాగస్వామి రిటైర్డ్ సీఐ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి కి పున్నమి దినపత్రిక ఖమ్మం జిల్లా తరుపున ప్రఘడా సానుభూతి తెలియజేస్తున్నాను

