సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి : నిర్మల్ జిల్లా కుభీర్ మండల సరిహద్దు లో ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ లోని 79 సంవత్సరాల చరిత్ర గల వినాయకుని మండపంలో కర్ర వినాయకుడు కొలువుదిరాడు. గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తెల్లవారుజామున కర్ర వినాయకుని ప్రతిష్టించారు. భక్తుల కోర్కెలు తీర్చే సత్య గణేశుడిగా విరాజిల్లుతున్న ఈ గణేశుని దర్శనానికి మహారాష్ట్ర మరియు తెలంగాణ లక్షలాది భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు. వినాయకుని వద్ద భక్తులు కోరికెలు కోరుకొని కొబ్బరికాయతో ముడుపులు కడతారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఆలయ గర్భ గుడి ప్రతిష్టించిన కర్ర వినాయక విగ్రహానికి 11రోజుల పాటు ఇక్కడ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు దర్శనానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు కీర్తనల కార్యక్రమలు నిర్వహిసస్తారు. 1948 లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొయ్య బొమ్మల క్షేత్రంలో ఈ కర్ర వినాయకుని గుండాజి అనే కళాకారుడు చేసినారు. మహిమగల సత్య గణేశునిగా పేరు ఉన్న గణేశునికి ఏట లక్షలాదిమందికి దర్శించుకుంటారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర చత్తీస్గడ్ కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరికలు తీర్చే సత్య గణేశుని దర్శించుకుంటారు. 11 రోజుల తర్వాత గ్రామంలోని ఊరేగింపుగా నిర్వహించి నిమజ్జనానికి తీసుకెళ్తారు. సమీపంలోని వాగులో నిమజ్జనం చేయకుండా నీళ్లను చలి మళ్లీ యధావిధిగా గర్భ గుడిలో పెడతారు. గ్రామస్తులు నిమజ్జనం కోసం ఓ మట్టి గణేష్ ని విగ్రహన్ని నిమజ్జనం చేస్తారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అని ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం 200 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పదకొండు రోజుల పాటు భక్తులకు అన్నదానం కార్యక్రమం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వాయిస్ ఓవర్ : స్వతంత్రం రాకముందు గ్రామంలో ప్లేగు కలరా లాంటి అంటూ వ్యాధులు ప్రబలి ఎన్ని వైద్యాలు చేయించిన వ్యాధులు నయం కాకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు తెలిపారు. అంతలోనే వినాయక చవితి రావడంతో గ్రామంలోని కర్ర వినాయకుని ప్రతిష్టాపించడంతో గ్రామంలోని అన్ని వ్యాధులు తొలగిపోయాయని గ్రామంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవనం కొనసాగించారని అన్నారు. గ్రామస్తులు గ్రామంలోని ఎవరు వ్యవసాయ పనులకు వెళ్లకుండా 11 రోజులు ఈ మహిమగల గణేశుని సేవలో ఉంటారు. గత ఏడాది 11 రోజులలో ఈ మహిమ గణేశునికి కోటిన్నర రూపాయల కానుకలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. బైంసా డిపో నుండి పాలజ్ గ్రామానికి తెలంగాణ ఆర్టీసీ వాళ్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇటు మహారాష్ట్ర నుండి పాలజ్ బైంసాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.



