Friday, 11 September 2026
  • Home  
  • 5 ఏళ్ల లో జగన్ ఒక్క డీఎస్సీ అయినా? బీద రవిచంద్ర ఎద్దేవా
- ఆంధ్రప్రదేశ్

5 ఏళ్ల లో జగన్ ఒక్క డీఎస్సీ అయినా? బీద రవిచంద్ర ఎద్దేవా

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి) అయిదేళ్ల లో ఒక్క డిఎస్సీ కూడా. చేయకుండా,టీచర్ పోస్టుల భర్తీని ద్వేషించే జగన్ కు, 16 వేల టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేసిన లోకేష్ ఎలా నచ్చుతాడు అంటూ యమ్.యల్.సి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎద్దేవా చేశారు.తాను చేయలేకపోయిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన నారా లోకేష్ ను రాజీనామా చేయాలని జగన్, వైసీపీ నేతలు కోరడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మెగా డిఎస్సీ తో నిరుద్యోగుల కలలను నిజం చేసిన నాయకుడు నారా లోకేష్, మెగా డిఎస్సీ ను అడ్డుకునేందుకు కోట్లాది రూపాయలను కోర్టులకు ఖర్చు చేసిన నాయకుడు జగన్. అని ఆయన పోల్చారు. డీఎస్సీ పరీక్షలకు ముందు, ఆ తరువాత కూడా వైసీపీ ప్రోద్బలంతో కోర్టులలో పలు పిటిషన్లు దాఖలు చేశారని వీటిపై ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వాస్తవాలు, నిబంధనలను, ఆధారాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు డీఎస్సీ నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరగలేదని పిటీషన్లు అన్ని కొట్టివేసిందని అన్నార.. డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేసి ఏడాది గడిచిన తర్వాత మరలా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని తమ ప్రభుత్వం లో నిర్వహించలేకపోయిన డి.యస్.సి లు, ఇవ్వలేకపోయినా ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం చేసి చూపడంతో జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని రవిచంద్ర ఆరోపించారు. పొంతన లేని పోలికలతో, ఆధారాలు లేని ఆరోపణలతో, డి.యస్.సి నిర్వహణపై కనీస అవగాహన లేని నేతలు నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులు సాధించినవారిని మానసిక క్షోభకు గురి చేయడం తో పాటు, రాబోయే డిఎస్సీ ని ఏదో రకంగా అడ్డుకుని నిరుద్యోగులను భయాందోళనలకు గురి చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పని చేస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా రాష్ట్రంలో విప్లవాత్మక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టి నారా లోకేష్, యేటా జాబ్ కేలండర్ ను ప్రకటించి నిరుద్యోగులలో భరోసా నింపుతున్నారని. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సీ ఇచ్చిందని, త్వరలో మరో డిఎస్సీ ఇవ్వనున్నది కూటమి ప్రభుత్వమే అని..ఎవరెన్ని కుట్రలు చేసినా, విష ప్రచారం చేసినా ఉద్యోగాల భర్తీ ఆగదని రవిచంద్ర స్పష్టం చేశారు.

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూలై పున్నమి)
అయిదేళ్ల లో ఒక్క డిఎస్సీ కూడా. చేయకుండా,టీచర్ పోస్టుల భర్తీని ద్వేషించే జగన్ కు, 16 వేల టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేసిన లోకేష్ ఎలా నచ్చుతాడు అంటూ యమ్.యల్.సి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు బీద రవిచంద్ర ఎద్దేవా చేశారు.తాను చేయలేకపోయిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన నారా లోకేష్ ను రాజీనామా చేయాలని జగన్, వైసీపీ నేతలు కోరడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
మెగా డిఎస్సీ తో నిరుద్యోగుల కలలను నిజం చేసిన నాయకుడు నారా లోకేష్, మెగా డిఎస్సీ ను అడ్డుకునేందుకు కోట్లాది రూపాయలను కోర్టులకు ఖర్చు చేసిన నాయకుడు జగన్. అని ఆయన పోల్చారు.
డీఎస్సీ పరీక్షలకు ముందు, ఆ తరువాత కూడా వైసీపీ ప్రోద్బలంతో కోర్టులలో పలు పిటిషన్లు దాఖలు చేశారని వీటిపై ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వాస్తవాలు, నిబంధనలను, ఆధారాలను పరిశీలించిన తర్వాత హైకోర్టు డీఎస్సీ నిర్వహణలో ఎటువంటి అక్రమాలు జరగలేదని పిటీషన్లు అన్ని కొట్టివేసిందని అన్నార..
డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేసి ఏడాది గడిచిన తర్వాత మరలా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని తమ ప్రభుత్వం లో నిర్వహించలేకపోయిన డి.యస్.సి లు, ఇవ్వలేకపోయినా ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం చేసి చూపడంతో జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని రవిచంద్ర ఆరోపించారు.
పొంతన లేని పోలికలతో, ఆధారాలు లేని ఆరోపణలతో, డి.యస్.సి నిర్వహణపై కనీస అవగాహన లేని నేతలు నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
టీచర్ పోస్టులు సాధించినవారిని మానసిక క్షోభకు గురి చేయడం తో పాటు, రాబోయే డిఎస్సీ ని ఏదో రకంగా అడ్డుకుని నిరుద్యోగులను భయాందోళనలకు గురి చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పని చేస్తున్నారు.
విద్యాశాఖా మంత్రిగా రాష్ట్రంలో విప్లవాత్మక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టి నారా లోకేష్, యేటా జాబ్ కేలండర్ ను ప్రకటించి నిరుద్యోగులలో భరోసా నింపుతున్నారని.
ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సీ ఇచ్చిందని, త్వరలో మరో డిఎస్సీ ఇవ్వనున్నది కూటమి ప్రభుత్వమే అని..ఎవరెన్ని కుట్రలు చేసినా, విష ప్రచారం చేసినా ఉద్యోగాల భర్తీ ఆగదని రవిచంద్ర స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.