ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి న్యూస్ జిల్లా ప్రతి నిధి )
సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సంపూర్ణ అనుమతి, సిఫార్సుల మేరకు సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలు, 2 టౌన్ కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో సంప్రదింపులు జరిపి, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది
సత్తుపల్లి మండలం – భీమిరెడ్డి సుబ్బారెడ్డి
వేంసూర్ మండలం – కాసర చంద్రశేఖర్ రెడ్డి
పెనుబల్లి మండలం – పంది వెంకటేశ్వరరావు
కల్లూరు మండలం – పొత్రు అర్జునరావు
తల్లాడ మండలం – గొడుగునూరి లక్ష్మారెడ్డి
సత్తుపల్లి టౌన్ – గాదె చెన్నకేశవరావు
కల్లూరు టౌన్ – ఎస్.కె. ఉస్మాన్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


