22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉంటే, అది ప్రైవేటు భూమిగా నిర్ధారణ అయిన వెంటనే రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులేని జాబితా రూపొందించాలని సూచించారు. ప్రైవేటు భూమిలో ఒక్క అంగుళానికీ ఇబ్బంది రానివ్వమని భరోసా ఇచ్చారు. ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, పుకార్లను నమ్మవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

22-ఏ భూములపై ఆందోళన వద్దు: సీఎం రేవంత్ రెడ్డి